ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 25: ప్యాకేజీలకుఅమ్ముడుపోయిన మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధ్దం గా ఉండాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి కొర్రెములలోని సీబీజీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన మండల బూత్ కమిటీల సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ టికెట్‌తో ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్‌రెడ్డి అభివృద్ధిని విస్మరించి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారారని అన్నారు.
నేను చేసిన అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నాడని విమర్శించారు.పిల్లికి బిచ్చం వేయని వజ్రేశ్ యాదవ్ ప్రజల గుర్తింపు పొందలేడని చెప్పారు. నియోజకవర్గంలో 430 మందికి బీఫాంలు ఇచ్చి ప్రజా ప్రతినిధులుగా గెలిపించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీలను కూడా అమలు చేయలేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.