మేడ్చల్/ఘట్కేసర్/బోడుప్పల్, నవంబర్ 1 : మేడ్చల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా…బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ కార్పొరేషన్, పోచారం, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు భారీగా బుధవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిందన్నారు.సాగునీరు, తాగునీరు, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు తదితర మౌలిక వసతులు కల్పించిందని అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుందుని తెలిపారు. బీఆర్ఎస్ కంటే ముందుకు పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేసేందేమి లేదన్నారు.
కండ్ల ముందు అభివృద్ధి, సంక్షే మం కన్పిస్తుంటే ప్రజలెలా కాంగ్రెస్‌ను నమ్ముతారని ప్రశ్నించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ సంక్షేమాన్ని కొనసాగిస్తారని తెలిపారు. రూ.400కే సిలిండర్, రూ.15లక్షల ఆరోగ్య బీమా, రూ.5వేలకు ఆసరా పింఛన్లుపెంపు,రూ.5లక్షల బీమా తదితర సంక్షేమ పథకాలు అమలు అవుతాయని తెలిపారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై తండాపతండాలుగా బీఆర్ఎస్ చేరుతున్నారని తెలిపారు. యువత, మహిళలు కూడా స్వచ్ఛదంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం బీఆర్ఎస్కే సాధ్యమన్నారు.
వందలాది మంది చేరిక
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో బీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్‌రెడ్డి, చైర్మన్ బి.కొండల్‌రెడ్డిల ఆధ్వర్యంలో రాజునాయక్, విక్రమ్ ముదిరాజ్తో పాటు సుమారు 600 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు చామకూర భద్రారెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జి.బాలేశ్, ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నోజిగూడలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి శివాస్ ఫంక్షన్ హాల్ వరకు యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బోడుప్పల్ నగరపాలకసంస్థ పరిధిలోని చెంగిచర్ల 2వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వివిధ పార్టీలకు చెందిన 100మంది గులాబీ గూటికి చేరుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు జంగయ్యయాదవ్, చందర్‌గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, కోఆప్షన్ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాలకృష్ణ, నాయకులు రవిగౌడ్, ఉప్పరి విజయ్, మోతెరాజు, శత్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ భాసరేగడికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కౌన్సిలర్ రాజకుమారిసుధాకర్ ఆధ్వర్యంలో శామీర్‌పేట మండలం ఆలియాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ చేశారు. చేరిన వారిలో పులి అశోక్, వెంకటేశ్, ఆరోగ్యం, తేజ, బాలు, బాలస్వామి, వంశీ, తరుణ్, అరవింద్, అభి, కార్తీక్, , ప్రశాంత్, విజయ్, ఎస్.ప్రశాంత్ ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు మం డల సంజీవ గౌడ్, వైస్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, ఫిలిప్స్, కౌన్సిలర్ బేరి బాలరాజు, భాస్కర్ రెడ్డి, మత్యాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.