సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం న్యూ బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రజక సంఘం నేతలతో కలిసి మంత్రి మల్లారెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దొరలు, రజాకార్లపై పోరాడిన ఐలమ్మ ధీరవనితగా నిలిచిందన్నారు. రాష్ట్ర సాధన పోరాటంలో కూడా సీఎం కేసీఆర్ చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే పోరాటం చేశారని తెలిపారు. రాష్ట్రంలో రజకులకు దోబీ ఘాట్లు, డ్రైక్లీనింగ్కు అవసరమైన యంత్రాలను ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అందించామన్నారు. ఇటీవలే సీఎం నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ సదుపాయం కూడా కల్పించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆంజనేయులు, రాజేశ్, జనార్దన్, రాము లు, కార్యకర్తలు పాల్గొన్నారు.