కంటోన్మెంట్/వినాయక్‌నగర్/అడ్డగుట్ట/ మల్కాజిగిరి/ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 15: స్వాతంత్య్ర వేడుకలను ఆదివారం కంటోన్మెంట్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించారు. బోర్డు పరిధిలోని మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బోయిన్పల్లి, బొల్లా రం, రెజిమెంటల్‌బజార్, రసూల్పురాలలోని ప్రభు ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. బోయిన్పల్లి చౌరస్తా వద్ద మంత్రి మల్లారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా పికెట్, మడ్‌ఫోర్ట్, రసూల్‌పురా, మారేడ్‌పల్లిలోని పలు ప్రాంతాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న జాతీయ జెండాను ఎగురవేశారు. బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జెండాను ఆవిష్కరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ ఆనంద్ జెండాను ఎగురవేశారు.
సీనియర్ సెక్షన్ ఇంజినీర్ వర్క్స్ సౌత్ లాలాగూడ కార్యాలయంలో నిర్వహించిన జెండా వేడుకల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ సుక్క మల్లేష్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జెండా ఎగురవేయగా ఆయా ప్రాంతాల్లో ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండాలు ఎగురవేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన వేడుకను చారిత్రాత్మకమైన ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించగా, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఫ్యాకల్టీ క్లబ్, నాన్ టీచింగ్ హోమ్‌ల వద్ద ఆయన జెండా ఆవిష్కరించారు.