ఇబ్రహీంపట్నం చెరువును అభివృద్ధి చేయండి.. హెచ్ఎండీఏకు కేటీఆర్ సూచన
Ibrahimpatnam Lake | హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువును అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై దృష్టి సారించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు
హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువును అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై దృష్టి సారించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. రిసార్ట్‌తో పాటు బోటింగ్ కాయకింగ్ పారాసైలింగ్ వంటి ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకువస్తే పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతుందని ఆ నెటిజన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. వారాంతాల్లో మంచి టూరిస్ట్ ప్లేస్‌గా ఈ ప్రాంతం గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు.
ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. చెరువు అభివృద్ధి గల అవకాశాలను అన్వేషించాలని హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు.
హైదరాబాద్ – విజయవాడ హైవేకు కుడి వైపున ఇబ్రహీంపట్నం చెరువు ఉంటుంది. ఈ చెరువును ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో నిర్మించారు.
Request @HMDA_Gov to explore https://t.co/tm5kIW5zEr
— KTR (@KTRTRS) October 14, 2022
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

