ఎక్కడ నడిస్తే ఎక్కువ మేలు?
నడక సాధారణ జీవన శైలిలో భాగం చేసుకుంటే ఉత్సాహంగా ఉంటారు. గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు నడక చేసే మేలు చాలా ఉంది. జిమ్ మెంబర్షిప్, ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు.
నడక సాధారణ జీవన శైలిలో భాగం చేసుకుంటే ఉత్సాహంగా ఉంటారు. గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు నడక చేసే మేలు చాలా ఉంది. జిమ్ మెంబర్షిప్, ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు. చాలామంది ఇండోర్‌లో థ్రెడ్ మిల్‌పై నడుస్తుంటారు. కొంతమంది నడక కోసం పార్కులు, మైదానాలు, ఆరుబయట ప్రదేశాలకు పోతారు. ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని చాలామందికి సందేహాలున్నాయి.
చాలారకాల సలహాలు వినిపిస్తున్నాయి. ఇండోర్, ఆరుబయట ఎక్కడ నడిచినా క్యాలరీలు ఖర్చవుతాయి. కానీ, ఆరుబయట నడకవల్ల కొన్ని అదనపు లాభాలున్నాయని ఫిట్నెస్ నిపుణులు అంటున్నారు. ఆరు బయట నడకలో ఎత్తుపల్లాలుంటాయి. అందువల్ల నడక వేగంలో మార్పు వస్తుంది. ఎగువకు నడిచేప్పుడు ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. గుండె వేగం పెరుగుతుంది. ఆరుబయట నడిచినప్పుడు పరిసరాలను పరిశీలిస్తూ ఉండటం వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.
ఈ ఆనందం వల్ల ఒత్తిడి తగ్గి మరింత ఉత్సాహంగా ఉంటారు. ఇండోర్‌లో నడిచే ప్రదేశం సమతలంగా ఉంటుంది. కాబట్టి కండరాలు తక్కువ బలాన్ని ప్రయోగిస్తాయి. ఎత్తైన ప్రదేశం వైపునకు నడిచేటప్పుడు కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ బలాన్ని ప్రయోగించాల్సి వస్తుంది. అందువల్ల కండరాలు మరింత బలోపేతమవుతాయి. ఇండోర్ వాకింగ్ బిజీ షెడ్యూల్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేయొచ్చు. ఔట్‌డోర్ వాకింగ్ వాతావరణ ప్రభావం, పని ఎక్కువగా ఉన్నప్పుడు సాధ్యపడదు. ఈ సమయంలో ఆరుబయట సాధ్యం కాకపోతే ఇండోర్ వాకింగ్ ప్రయత్నిస్తే మంచిది!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

