నిరసన ప్రదేశాన్ని నిరవధికంగా ఆక్రమించుకోలేరు
ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనల సమయంలో దుకాణాలు మూసివేయడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంటూ వ్యాపారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం స్పందించింది.
- ఇతరులకూ నిరసన తెలిపే అవకాశం ఉండాలి
- ఢిల్లీ వ్యాపారుల పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, నవంబర్ 3: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనల సమయంలో దుకాణాలు మూసివేయడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంటూ వ్యాపారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం స్పందించింది. నిరసన ప్రదేశాన్ని నిరవధికంగా ఆక్రమించి ఉంచడం సరికాదని పేర్కొన్న న్యాయస్థానం ఈ అంశంపై ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారుల నుంచి సమాధానాలను కోరింది.
తమ సమస్యలను తెలియచేసే అవకాశం ఇతరులకు కూడా ఉండాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. సామూహిక నిర్బంధాలు, పోలీసుల క్రూరత్వం, మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ నిలిపివేతలపై కూడా ఆందోళనలు వ్యక్తం చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా నిరసన తెలిపే హక్కును జీవనోపాధి హక్కుతో సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. మీరు ఒక ప్రదేశాన్ని ఎల్లవేళలా ఆక్రమించుకోలేరు. రైతులు, జర్నలిస్టులు ఎక్కడకు వెళతారు? నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.
నిరసనల కోసం నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి అని సీజేఐ పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనలకు అనుమతినిచ్చే ఉత్తర్వులలో ఆ అనుమతి ఏ నిబంధనలు, షరతులకు లోబడి ఇవ్వబడిందో స్పష్టంగా పేర్కొనాలని సీజేఐ ఆదేశించారు. నేను ఇప్పుడు నిరసన తెలుపుతున్నాను కాబట్టి ఇతరులను అడ్డుకుంటానంటే కుదరదు అని ఆయన నొక్కి చెప్పారు. రాజధానిని నిరసనలు చుట్టుముట్టడంతో పెరుగుతున్న వ్యాపార నష్టాలపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ కారణంగా నవంబర్ 1న ఢిల్లీ వాణిజ్య రంగానికి సుమారు రూ.11,000 కోట్ల నష్టం వాటిల్లిందని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

