Childrens Day | తాగునీటి కోసం చిన్నారి అభ్యర్థన.. స్పందించిన కేటీఆర్
Childrens Day | చిల్డ్రన్స్ డే రోజున ఓ చిన్నారి చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లోని గోల్డెన్ సిటీ కాలనీ(పిల్లర్ నంబర్ 248) లో గత ఐదేండ్ల నుంచి తాగునీటి
Childrens Day | చిల్డ్రన్స్ డే రోజున ఓ చిన్నారి చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లోని గోల్డెన్ సిటీ కాలనీ(పిల్లర్ నంబర్ 248) లో గత ఐదేండ్ల నుంచి తాగునీటి సమస్య ఉందని చిన్నారి ఉమర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. డ్రింకింగ్ వాటర్ పైపులైన్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు. అన్ని ట్యాక్సులు చెల్లిస్తున్నామని చెప్పాడు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి సమస్య పరిష్కరించాలని జల మండలి ఎండీ దాన కిశోర్‌కు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జల మండలి ఎండీ దాన కిశోర్ గోడ్డెన్ సిటీ కాలనీకి వెళ్లారు. చిన్నారి ఉమర్‌ను దాన కిశోర్ కలిశారు. అనంతరం కేటీఆర్‌కు ట్వీట్ చేశారు జలమండలి ఎండీ. గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి చిన్నారి ఉమర్‌ను కలిశాం. ఈ ఏరియాకు వాటర్ పైపులైన్ కోసం రూ. 2.85 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వర్షాకాలం కారణంగా మొన్నటి వరకు పనులు చేపట్టలేదు. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. వాటర్‌లైన్‌కు ఉమర్ నివాసం 3.94 కిలోమీర్ల దూరంలో ఉందని, అందుకు గానూ రూ. 94 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. రెండు వారాల్లో ఆ ఏరియాకు తాగునీటి సరఫరా చేస్తామని జలమండలి ఎండీ దాన కిశోర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎండీ దాన కిశోర్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Well done MD Garu 👍 https://t.co/ukjs32Tzuo
— KTR (@KTRTRS) November 14, 2022
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

