KTR | హైదరాబాద్ : సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు చేశారన్నారు. ఆయన మరణం ఉర్దూ జర్నలిజంకు తీరనిలోటని అన్నారు. జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో ఛాతి నొప్పితో అలీఖాన్ కింద పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. జహీరుద్దీన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు నిర్వహించిన గద్దర్ అంతిమయాత్రలో జహీరుద్దీన్ పాల్గొన్నారు.