మన్సూరాబాద్, సెప్టెంబర్ 25: మూసీ పై రూ. 545 కోట్లతో 14 వంతెనలను కడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక్కో వంతెన ఒక్కో ప్రత్యేకతతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. నాగోల్ డివిజన్ పరిధి ఫతుల్లాగూడ నుంచి పిర్జాదీగూడ మార్గంలోని మూసీ నదిపై రూ. 52 కోట్లతో 200 మీటర్ల పొడవున నిర్మించనున్న వంతెన పనులకు సోమవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మూసీ నదిపై 14 బ్రిడ్జిలను నిర్మించనున్నామని, ఫతుల్లాగూడ, మూసారాంబాగ్, ఉప్పల్ భగాయత్‌తో పాటు మరి కొన్ని ప్రదేశాల్లోని మూసీపై వంతెలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది…
ఫతుల్లాగూడ బ్రిడ్జిని రూ. 52 కోట్లతో 200 మీటర్ల పొడవున నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్, గ్రీస్ లాంటి విదేశాలకు అధికారులను పంపించి, అక్కడ వందల ఏండ్ల కింద ఎలా అయితే అద్భుతమైన బ్రిడ్జిలను కట్టారో పరిశీలించి అదే తరహాలో మూసీ నదిపై వంతెనలను నిర్మించేందుకు నిర్ణయించామన్నారు. 450 ఏండ్ల చరిత్ర కలిగిన మహానగరంలో మూసీ నదిపై నిర్మించే బ్రిడ్జిలు శాశ్వతంగా ఉంటాయని, ఇందుకు తగ్గట్లుగా నిర్మాణ డిజైన్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే దుర్గం చెరువు వంతెనపై సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయని, త్వరలో నిర్మించే ఫతుల్లాగూడ బ్రిడ్జిపై సైతం అంతకంటే ఎక్కువగా షూటింగ్‌లు జరుగుతాయని చెప్పారు. వంతెన నిర్మాణం పూర్తయితే పిర్జాదీగూడ, ఫతుల్లాగూడ మధ్య మంచి కనెక్టివిటీ ఏర్పడి నాగోల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. 160 కిలోమీటర్ల మేర ఉండే ఓఆర్ఆర్తో పాటు ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు ఎక్కడో దూర ప్రాంతం నుంచి వెళ్లకుండా..కొత్తగా నిర్మించే ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్లే విధంగా రోడ్ కమ్ వంతెనలను నిర్మిస్తామన్నారు. మంచిరేవుల నుంచి మొదలుకుని కింది వరకు మూసీ నదిపై నిర్మించే బ్రిడ్జికు రూ. 10 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఓఆర్ఆర్ తరహాలో పశ్చిమ వైపు నుంచి తూర్పు వరకు రోడ్డు కమ్ బ్రిడ్జిని నిర్మించబోతున్నామని తెలిపారు.
ఇబ్బందులు తీరాయి..
ఎల్బీనగర్లో రోడ్డు, విద్యుత్, మంచినీటి ఇబ్బందులు తీరాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్ఎన్డీపీ కింద రూ. 1000 కోట్లతో మొదటి దశలో నాలాలను నిర్మించామని త్వరలో రెండో దశలో రూ. 5 వేల కోట్లతో నిర్మించే ఎస్ఎన్డీపీ పనులను త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. హయత్‌నగర్ వరకే కాదు పెద్ద అంబర్‌పేట వద్ద ఉన్న ఓఆర్ఆర్ వరకు మెట్రోను తీసుకెళ్లబోతున్నట్లు తెలిపారు. తొమ్మిదిన్నర ఏండ్లల్లో హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసిన పని కండ్ల ఎదుటే ఉన్నదన్నారు. పనిచేసే నాయకులు, ప్రభుత్వాన్ని ప్రోత్సహించి మద్దతు ఇవ్వాలని.. హైదరాబాద్‌ను దేశంలోనే ఆదర్శనగరంగా, విశ్వనగరంగా చేయాలనే సంకల్పం సీఎం కేసీఆర్‌కు ఉన్నదన్నారు.
మరో 40 వేల డబుల్