హైదరాబాద్, ఆట ప్రతినిధి జూన్ 23: అంతర్జాతీయ ఒలంపిక్ డే సందర్భంగా నగరంలో ఒలింపిక్ డే రన్‌ను గ్రేటర్ హైదరాబాద్‌లోని పది కేంద్రాల నుంచి అతి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం లాల్ బహుదూర్ స్టేడియంలోని ఫతే మైదాన్ క్లబ్ కేంద్రం నుంచి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసన మండలి సభ్యుడు, ఒలింపిక్ డే రన్ కమిటీ చైర్మన్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ అబ్కారీ బేవరేజ్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్, పల్లవి ఇంటర్నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ కొమరయ్య, అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి ప్రియాంక సాగర్లతో వెయ్యి మంది క్రీడాకారులు విద్యార్థులతో రన్ కొనసాగింది.
లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానా మైదానం నుంచి రన్ జరిగిది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి నుంచి జగన్ మోహన్ గౌడ్, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి జీపీ ఫాల్గుణ ఆధ్వర్యంలో రన్ ప్రారంభించారు.
చార్మినార్ నుంచి తెలంగాణ టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ కార్యదర్శి పి.ఇమాన్యుయేల్, మహేష్, చాదర్‌ఘాట్ విక్టోరియా మెమోరియల్ ఇండోర్ స్టేడియంలో హరిదాస్, షౌకత్ అలీ నాయకత్వం వహిస్తూ రన్‌ను ముందుకు సాగించారు. వివిధ కూడళ్ల నుంచి తీసుకువచ్చిన క్రీడా జ్యోతులను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు, శాసన మండలి సభ్యుడు, ఒలింపిక్ డే రన్ కమిటీ చైర్మన్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అందుకొని జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కే.మహేశ్ సాగర్, చాతిరి బాబూరావు సాగర్, ప్రేమ్‌రాజ్, మధు, జగన్ మోహన్ గౌడ్, బి.వెంకటేష్, విజయ్‌పాల్ రెడ్డి పాల్గొన్నారు.