Minister Indrakaran reddy | ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Minister Indrakaran reddy | తెలంగాణ వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు. రూ.12 వందల కోట్లతో యదాద్రి (Yadadri) ఆలయ పునర్నిర్మింపజేశారని, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా.. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుందని తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు. రూ.12 వందల కోట్లతో యదాద్రి (Yadadri) ఆలయ పునర్నిర్మింపజేశారని, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా.. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మండలం పుప్పాలగూడలోని సంకటహరణ శ్రీ హనుమాన్ ఆలయాన్ని (Hanuman Temple) సందర్శించారు. స్వయంభువుగా వెలసిన హనుమాన్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వీ. ప్రకాశ్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సంకట హరణ హనుమాన్ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ.ప్రకాశ్, ఆలయ పాలక మండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

