వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 08ః చిరుధాన్యాల ఆహారం పోషకాల గని అని, వీటికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుందని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్-ఐఐఎంఆర్) రాజేంద్రనగర్ ఇంచార్జీ డైరెక్టర్ డా.శ్యాంప్రసాద్ అన్నారు. సోమవారం రెండు తెలుగు రాష్ర్టాల నుంచి వచ్చిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థులకు మిల్లెట్స్ సాగు, ప్రాసెసింగ్ తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఇక్కడి వాతావరణ పరిస్థితులు, నేలలు, అనుకూలమన్నారు. రైతులకు అవగాహణ కల్పిస్తే అధిక దిగుబడులు సాధ్యమన్నారు. తక్కువ నీటి వసతి, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడి, అధిక లాభాలు సాధించవచ్చని చెప్పారు. గ్రామీణ రైతులకు అవగాహన కల్పించి, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచితే సరిపోతుందన్నారు. తక్కువ కాలంలో దిగుబడి, చీడపీలను తట్టుకునే అనేక రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సీనియర్ శాస్త్రవేత్త, ఫ్రోగ్రామ్ ఇంచార్జి డా.శ్రీనివాస్, డా. రవిచంద్రన్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. చిరుధాన్యాల ఉత్పత్తి, పోషక భద్రత, జీవనోపాధి, ప్రొడక్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.