కుటుంబ నియంత్రణపై అవగాహన
స్త్రీలకు కుటుంబ నియంత్రణ భారాన్ని వేయకుండా ఎటువంటి కోత, కుట్టు లేని నో స్కాల్పెల్ వేసెక్టమీ శస్త్ర చికిత్సకు మగవారు ముందుకు రావాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి సూచించారు
- వేసెక్టమీ చికిత్సకు పురుషులు ముందుకు రావాలి
- జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి
సుల్తాన్‌బజార్, నవంబర్ 25: స్త్రీలకు కుటుంబ నియంత్రణ భారాన్ని వేయకుండా ఎటువంటి కోత, కుట్టు లేని నో స్కాల్పెల్ వేసెక్టమీ శస్త్ర చికిత్సకు మగవారు ముందుకు రావాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి సూచించారు. కింగ్ కోఠి క్లస్టర్ సుల్తాన్‌బజార్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో నో స్కాల్పెల్ వేసెక్టమీ(ఎన్ఎస్వీ)శస్త్ర చికిత్సపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఎస్పీహెచ్వో, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పద్మ జతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరిద్దరు పిల్లలు జన్మించిన అనంతరం సంతానం వద్దనుకునే సమయంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలన్నారు.
స్త్రీలు ఒకటి,రెండు సార్లు ప్రసవ వేదన అనుభించి ఉంటారని వారిపై కుటుంబ నియంత్రణ ఆపరేషన్ భారాన్ని మోపడం సరైంది కాదన్నారు. కోత, కుట్టులేని నో స్కాల్పెల్ వేసెక్టమీ శస్త్ర చికిత్స కేవలం ఐదు నిమిషాల్లో పూర్తవుతుందన్నా రు. ఈ ఆపరేషన్ పూర్తయిన అనంతరం తమ అన్ని పనులను యథావిధిగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నో స్కాల్పెల్ వేసెక్టమీ శస్త్ర చికిత్స చేయించుకొని రూ. 1100 పారితోషికాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుల్తాన్‌బజార్ యూపీహెచ్సీ పీహెచ్ఎన్ రామలక్ష్మితో పాటు వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

