చెరువుల పరిరక్షణకు ఆమోదం
జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన 3వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలను సభ్యులు ఆమోదించారు. 14 అంశాలు, 3 టేబుల్ ఐటమ్లకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు.
- జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక అంశాలకు సభ్యుల ఆమోదం
- రోడ్లు, అభివృద్ధి పనులకు ఆస్తుల సేకరణకు నిధుల కేటాయింపు
సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన 3వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలను సభ్యులు ఆమోదించారు. 14 అంశాలు, 3 టేబుల్ ఐటమ్లకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, డా.ఆయేషా హుమేరా, మహమ్మద్ సలీం, మహాలక్ష్మీ రామన్ గౌడ్, మహమ్మద్ గౌస్ ఉద్దీన్, సిఎన్.రెడ్డి, ఎండీ బాబా ఫసియుద్దీన్, వి.జగదీశ్వర్ గౌడ్, బూరుగడ్డ పుష్పతో పాటు సీసీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ్ ,చౌహాన్, రవికిరణ్, వెంకన్న, అడిషనల్ కమిషనర్లు..
స్నేహ శబరిష్, వేణుగోపాల్, యాదగిరి రావు, సెక్రటరీ సత్యనారాయణ, గీతా రాధిక, నళిని పద్మావతి, వేణుగోపాల్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు రత్నాకర్, సహదేవ్ రావు, భాసర్ రెడ్డి, కోటేశ్వర రావు, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్ నాయక్, అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఈలు రోహిణి, మోహన్ రెడ్డి, ఈఈలు రాధిక, మమత, హయాత్ నగర్ ఈఈ తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన అంశాలు
- దారుసలాం జంక్షన్ నుంచి మలకుంట రోడ్డు (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్) వరకు ఓహెచ్జీకి వెళ్లే రోడ్ల వెడల్పు 30 మీటర్లు ప్రతిపాదించబడిన సవరించిన రోడ్డు అభివృద్ధి ప్రణాళిక – మాస్టర్ ప్లాన్ రోడ్ వెడల్పును 24 మీటర్ల నుంచి 30 మీటర్లకు పెంచడానికి 102 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
- పురానాపూల్ నుంచి కార్వాన్ సాహు వరకు వయా కమేల ప్రతిపాదిత 18 మీటర్ల నుండి 24 మీటర్ల రోడ్డు అభివృద్ధికి గానూ 278 ఆస్తుల సేకరణ.
- హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఎన్ఎఫ్ఎస్ఎల్ జంక్షన్ వద్ద మల్టీ లెవల్ ఫె్లైఓవర్ నిర్మాణానికిగానూ రహదారి అభివృద్ధికి సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జలగం వెంగళరావు పార్ వరకు ప్రతిపాదించబడిన 30 మీటర్ల వెడల్పునకు 34.50 మీటర్లు రోడ్డు ఏర్పాటుకు 6 చోట్ల భూ సేకరణ.
- హెచ్ సిటీ ద్వారా టీవీ 9 జంక్షన్ వద్ద మల్టీ-లెవల్ ఫె్లైఓవర్ నిర్మాణానికి రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ 24 మీటర్ల వెడల్పు గల 36 మీటర్ల వరకు వెడల్పునకు 38 ఆస్తుల సేకరణ, రెండు విభాగాల మాస్టర్ ప్లాన్ రోడ్డు వెడల్పును పెంచడానికి 30 మీటర్ల నుంచి 36 మీటర్ల వరకు ఫారెక్స్ ఫారెన్ ఎక్సేంజ్ నుంచి సుల్తాన్ ఉల్ ఉలూం లా కాలేజీ వరకు 18 మీటర్ల నుంచి 24 మీటర్లు వరకు టీవీ9 జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు చేపట్టే రోడ్డు వెడల్పునకు కమిటీ ఆమోదం.
- బంజారాహిల్స్ రోడ్ నం.12 ప్లాట్ నంబర్ 16 బీ, నార్త్ వెనుక ఉన్న జీహెచ్ఎంసీ గార్డెన్ నిర్వహణను 2 సంవత్సరాల కాలానికి సీఎస్ఆర్ కింద ఖజానా గ్రూప్-ఇండియాతో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంఓయూ చేసేందుకు కమిటీ ఆమోదం.
- బంజారా హిల్స్ రోడ్ నం.4 ప్రకనే ఉన్న పార్ అభివృద్ధి, సుందరీకరణ, నిర్వహణను సీఎస్ఆర్ కింద సంవత్సర కాలానికి ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్‌తో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంఓయూ చేసుకునేందుకు కమిటీ ఆమోదం.
- జీహెచ్ఎంసీ ఉద్యోగుల క్రికెట్ బృందం 2023-24 సంవత్సరానికి గత ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి జీహెచ్ఎంసీ ప్రాతినిధ్యం వహించిన రూ.6,38,509 విలువైన క్రికెట్ స్పోర్ట్స్ మెటీరియల్ కిట్ల సేకరణపై అప్పటి కమిషనర్, జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యకు ఆమోదం.
- మాస్టర్ స్పోర్ట్స్ వేర్, సికింద్రాబాద్, జీహెచ్ఎంసీ ఎంప్యానెల్డ్ స్పోర్ట్స్ మెటీరియల్ కాంట్రాక్టర్ ద్వారా కోట్లను (నామినేషన్ ఆధారంగా) పిలిచి జీహెచ్ఎంసీ క్రికెట్ జట్టు సభ్యులకు వ్యక్తిగతంగా అప్పగించుటకు కమిటీ ఆమోదం.
- క్రీడల నిర్వహణకు క్రీడా సామగ్రిని సేకరించడానికి రూ.13,22,514/- మొత్తానికి జీహెచ్ఎంసీకి చెందిన 149 కార్పొరేటర్లకు 23 మార్చి నుంచి 25వ తేదీ వరకు కార్పొరేటర్లు నిర్వహించిన సపోర్ట్ మీట్ ఎంప్యానెల్డ్ స్పోర్ట్స్ మెటీరియల్ సరఫరాదారు మెస్సర్స్, భారత్ స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సపె్లై చేయుటకు నోటిఫికేషన్‌కు కమిటీ ఆమోదం.
- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం తూర్పు ద్వారం వైపు ఉన్న విగ్రహాలను తగిన ప్రదేశాలకు తరలించి సంబంధిత స్థలంలో వాటర్ ఫౌంటెయిన్ నిర్మించడానికి ప్రతిపాదనకు కమిటీ ఆమోదం.
- 11 చెరువుల పరిరక్షణలో భాగంగా రూ.55 లక్షలతో నీరి సంస్థతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు కమిటీ ఆమోదించింది. కాగా గడిచిన రెండుసార్లు వాయిదా పడిన ఈ అంశాన్ని ఎట్టకేలకు ఆమోదించడం గమనార్హం.
- ఇందిరాపార్కు స్ట్రీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్-1లో అదనపు వ్యయాన్ని తీర్చడానికి గానూ రూ.426 కోట్ల పరిపాలనా అనుమతికి కమిటీ ఆమోదించింది
- నాగోల్ క్రాస్ రోడ్ నుంచి ఆదర్శ్‌నగర్ వరకు స్ట్రామ్ వాటర్ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికిగానూ రూ.275 లక్షలతో పరిపాలన అనుమతికి ఆమోదించారు.
- నాగోల్‌లోని అగర్వాల్ గ్రానైట్స్ నుంచి నాగోల్ క్రాస్‌రోడ్ వరకు రూ.440 లక్షలతో వరద నీటి కాలువ నిర్మాణం
- నాగోల్‌లోని వాటర్ లాగింగ్ పాయింట్ అగర్వాల్ గ్రానైట్స్ ద్వారా మూసీ నుంచి నాగోల్ క్రాస్ రోడ్‌కు రూ.440 లక్షల అంచనాతో స్ట్రామ్ వాటర్ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికిగానూ పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం.
- ఎల్బీనగర్ సరిల్ లింగోజిగూడలోని ప్రియదర్శిని పార్ ప్రవేశద్వారం నుంచి శారద థియేటర్ ఎదురుగా రూ.595 లక్షల వ్యయంతో 2 లేన్ల వంతెన నిర్మాణానికి పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం.
- చర్లపల్లిలో డీ మార్ట్ మీదుగా పోచమ్మకుంట వరకు అకడ నుంచి కృష్ణారెడ్డి నగర్ కమాన్ కుషాయిగూడ వరకు రూ.375 లక్షలతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి అనుమతి ఇస్తూ కమిటీ ఆమోదం.
- చిన్న చర్లపల్లిలో మోడల్ గ్రేవ్ యార్డ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ నిర్మాణాలను రూ.550 లక్షలతో చేపట్టేందుకు కమిటీ ఆమోదం.
- జీహెచ్ఎంసీకి చెందిన ఆర్కే నగర్లో ప్లాట్ 38లో గల 400 గజాల భూమిలో సబ్ స్టేషన్ నిర్మాణానికి హబ్సిగూడ సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు అలాట్ చేస్తూ కమిటీ ఆమోదం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

