హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం.. ప్రపంచ ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. హరితహారంతో తెలంగాణ అంతా ఆకుపచ్చగా మారింది. ఎక్కడా చూసినా ఆకుపచ్చ తోరణాలు దర్శనమిస్తున్నాయడంలో సందేహాం లేనే లేదు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ పచ్చని చెట్లు పర్యాటకులను, పర్యావరణ ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి.
ఆకుపచ్చ తోరణంలా మారిన మెహిదీపట్నం – నార్సింగి రోడ్డుపై ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోలేహిమ్ ట్వీట్ చేశారు. ఇది ఆకుపచ్చ తెలంగాణ.. 10 కిలోమీటర్ల పొడవున్న మెహిదీపట్నం – నార్సింగ్ రోడ్డు పచ్చని చెట్లతో సుందరంగా తీర్చిదిద్దబడిందని పేర్కొన్నారు. రోడ్డు మధ్యలోని డివైడర్లపై, రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయని తెలిపారు. రెండేండ్ల క్రితం ఈ రోడ్డులో చెట్లు లేవు.. ఇప్పుడు మాత్రం వాహనదారులు ఎంజాయ్ చేస్తూ.. అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ.. రైడ్ చేస్తున్నారని ఎరిక్ ట్వీట్ చేశారు.
The greening of Telengana 🇮🇳!
Transformation of 10 km Mehdipatnam-Narsingi Road with Plantation in Central Median & along margins.In just 2 years the road is now a visual treat with an enjoyable ride for commuters.
Beautiful! ❤️🌳❤️ pic.twitter.com/4h7E1RRowO
— Erik Solheim (@ErikSolheim) May 27, 2022