సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 7 : వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి గురువారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారి జయశ్రీ తెలిపారు. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, హెచ్‌పీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ అకౌంట్స్, మ్యానుఫాక్చరింగ్, మార్కెటింగ్ తదితర ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. 18 ఏండ్ల నుంచి 35 ఏండ్లు కలిగి పదోతరగతి, ఇంట ర్మీడియట్, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. సుమారు 1500 పోస్టులకు ఎంపిక ఉంటుందని, ఆయా అర్హతల ఆధారంగా వేతనాలు ఉంటాయన్నారు. ఈనెల 9న హబ్సిగూడ ఒమేగా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణలో నిర్వహించే జాబ్‌మేళాకు హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 8309877396 సంప్రదించాలన్నారు.