మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను వేగవంతంగా పరిషరించేందుకు వార్డు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వార్డు కార్యాలయం పనితీరుపై నిర్వహించిన సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర వ్యాప్తంగా విసృ్తతంగా మౌలిక సదుపాయాలను పౌరులకు అందిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు అన్ని శాఖల సమన్వయంతో పరిషరించేందుకు పది మంది అధికారుల బృందంతో వార్డు కార్యాలయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు కో-ఆర్డినేషన్‌తో పని చేసి సమస్యల సత్వర పరిషారానికి కృషి చేస్తారని చెప్పారురు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో ఆరు జోనల్ కార్యాలయాలు, 30 సరిల్ కార్యాలయాలు ఉండగా, అదనంగా 150 వార్డు కార్యాలయాలు ప్రజలకు సేవ చేయనున్నాయని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, జలమండలి, శానిటేషన్, ఎంటమాలజీ, విద్యుత్ సంస్థలు ఇకపై సమిష్టిగా పనిచేయనున్నాయని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం ఒక రోజే 132 వార్డు కార్యాలయాలను ప్రారంభించగా మిగతా 18 కార్యాలయాలను త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు. వార్డు వ్యవస్థ పనితీరుపై ఆరు నెలల తర్వాత రివ్యూ చేస్తామని మంత్రి తలసాని వివరించారు.