Medical Shop | సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ మెడికల్ షాపును డీసీఏ అధికారులు సీజ్ చేసి, ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం..
ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ ఆయూబ్ పాషా నాగులబండలో డీసీఏ అనుమతి లేకుండానే మెడికల్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు బుధవారం ఆ మెడికల్ షాప్‌పై దాడి చేసి.. దుకాణంతో పాటు అందులో ఉన్న 23 రకాల ఔషధాలను సీజ్ చేశారు.