సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనను నిరసిస్తూ.. నగరంలోని మెడికల్ కళాశాలల వైద్య విద్యార్థులు బుధవారం ధర్నాకు దిగారు. ఓపీ సేవలను బహిష్కరించారు. దీంతో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కోఠి ఈఎన్టీ, సుల్తాన్‌బజార్,
పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలు, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, ఎర్రగడ్డ చాతీ దవాఖాన తదితర అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో ఓపీ సేవలకు ఆటంకం తప్పలేదు. ఓపీ సేవల బహిష్కరణపై జూడాలు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు సరైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.