నాణ్యమైన వైద్య సేవలందించడంలో పోటీ పడాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మీర్పేట్లోని నంది హిల్స్ బస్టాప్ వద్ద ‘హాన్షి ఆర్థో అండ్ మెడికల్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’ను ఎం.డి.శశిధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్ లాల్, జిల్లెల నరేందర్ రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎ.కామేశ్ రెడ్డి, ఆర్.నసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– జూబ్లీహిల్స్, జూలై 18