మేడ్చల్, ఫిబ్రవరి11(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో 83.99 ఓటింగ్ శాతం నమోదైంది. అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికల్లో అలియాబాద్లో 79,62, మూడుచింతలపల్లిలో 89.07, ఎల్లంపేటలో 83.27 ఓటింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీలో 20,454 ఓటర్లకు గాను 16,286 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 8,076 పురుషులు ఓట్లు పోలవ్వగా, 8,210 మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మూడుచింతలపల్లిలో 22,831 ఓటర్లు ఉండగా, 20,335 ఓట్లు పోలవ్వగా, ఇందులో 10,091 మంది పురుషుల ఓట్లు, 10,224 మహిళల ఓట్లు పోలయ్యాయి. ఎల్లంపేటలో 22, 581 ఓటర్లు ఉండగా, 18,805 ఓట్లు పోలవ్వగా, 9,281 మంది పురుషుల ఓట్లు, 9,524 మహిళల ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. మూడు మున్సిపాలిటీల్లో 68 వార్డులకు గాను 65,866 ఓటర్లు ఉండగా 55,426 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.