
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
అంబర్‌పేట/గోల్నాక, డిసెంబర్ 20: నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ముఖ్యంగా కలుషిత మంచినీటి నివావరణ కోసం ప్రత్యేక కృషి చేస్తున్నామన్నారు. సోమవారం గోల్నాక డివిజన్లోని అశోక్‌నగర్, గోవింద్‌నగర్, ఓల్డ్ కమలానగర్, న్యూకమలానగర్ తదితర ప్రాంతాల్లో జలమండలి అధికారులతో కలసి ఆయ న పాదయాత్ర నిర్వహించి, స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. బస్తీల్లో రంగుమారిన కలుషిత నీటి సరఫరా, లో-ప్రెషర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని బస్తీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే రెండు, మూడు రోజుల్లో కలుషితానికి కారణమైన పైపులైన్లను గుర్తించి వెంటనే మరమ్మతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే లోప్రెషర్ను పూర్తి స్థాయిలో నివారించి ప్రజలకు అవసరమైనంత నీటిని సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు రోహిత్, అశ్వక్, బస్తీవాసులు వినోద్, సంతోష్, జగన్, బక్కయ్య, రా జు, కిషన్‌సింగ్, లక్ష్మి, స్వరూప, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
అంబర్‌పేట : ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని ఇంద్రప్రస్థ కాలనీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవగాహన కార్యక్రమంలో కార్పొరేటర్ బి. పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని కాలనీ పరిశుభ్రతకు కృషి చేసిన వారికి అభినందన పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ సూచనల మేరకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలన్నారు. చెత్తాచెదారాన్ని రోడ్డు మీద వేయకుండా చెత్త బుట్టల్లోనే వేయాలని చెప్పారు. స్వచ్ఛ కాలనీగా ఎన్నికైన ఇంద్రప్రస్థ కాలనీ వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓహెచ్ డా. జ్యోతిబాయి, శానిటేషన్ ఇన్చార్జి ప్రతాప్, ఎస్ఎఫ్ఏలు నరసింహ, శ్రీనివాస్, కాలనీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సుష్మ, అనూరాధ, టీఆర్ఎస్ నాయకులు మిర్యాల రవీందర్, సాయి, శేఖర్, బీజేపీ నాయకులు చుక్కజగన్, జె. బాల్‌రాజ్, మిర్యాల శ్రీనివాస్, డి. వెంకటేశ్ పాల్గొన్నారు.