సిటీబ్యూరో, ఏప్రిల్ 24 ( నమస్తే తెలంగాణ) :సుంకిశాల ప్రాజెక్టు పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పైప్ లైన్ విస్తరణ పనులు.. సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు.
పైపు విస్తరణ పనుల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఏజెన్సీ అధికారులకు సూచించారు. నాణ్యతలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్టిక్రల్, పైపు లైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.