బంజారాహిల్స్,అక్టోబర్ 24: టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 10లోని సింగాడకుంట బస్తీ సంక్షేమసంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత మహ్మద్ ఎజాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బస్తీలు, కాలనీల్లో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తమ దృష్టికి తీసుకొస్తే తగిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఇమ్రాన్, మహ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.