GHMC | సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో ఆదివారం గ్రేటర్లోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. నగరంలోని కుషాయిగూడ, ఏఎస్రావు నగర్, కాప్రా, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.
కాగా, కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 31.2, కనిష్ఠం 23.2 డిగ్రీలు, గాలిలో తేమ 56 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.