సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): వాట్సప్ మ్యాట్రిమోని గ్రూపులో తనను తాను పాకిస్థానీ నటిగా పరిచయం చేసుకున్న ఓ యువతి.. తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ డబ్బులు అవసరమంటూ ఓ వ్యక్తిని నిండా ముంచింది. బహదూర్‌పురాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి.. ఒక మ్యాట్రిమోనియల్ వాట్సప్ గ్రూప్ ద్వారా వధువుగా వివరాలు ఇచ్చిన ఒక యువతిని సంప్రదించాడు.
ఆమె తన పేరు ఫాతిమా అని పరిచయం చేసుకొని.. ఫేక్ ఐడీలను చూపించి తనను తాను ప్రసిద్ధ పాకిస్తానీ నటిగా నమ్మించింది. రెండేళ ్లక్రితం ప్రారంభమైన ఈ పరిచయంలో ఇటీవల తన తల్లి అనారోగ్యం పేరుతో వ్యక్తి నుంచి కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్న యువతి.. కొద్దిరోజులకు తిరిగిచ్చేసింది. మరోసారి తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ పలు దఫాలుగా రూ.21,73,912 ట్రాన్స్ఫర్ చేయించుకుంది. తదనంతరం అతడి నంబర్‌ను బ్లాక్ చేసింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.