సిటీబ్యూరో: ఇటీవల పోలీసుశాఖలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని సీపీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్‌లో ఏండ్ల తరబడి పాతుకుపోయిన వారితో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇతరులు మొత్తం 65 మందిని కార్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ శుక్రవారం సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు సెంట్రల్ జోన్, నార్త్‌జోన్, సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్, సౌత్‌వెస్ట్‌జోన్, సౌత్‌ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్‌ల పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఓ మహిళా హెడ్‌కానిస్టేబుల్, ఐదుగురు ఏఆర్పీసీలు, 41 మంది కానిస్టేబుళ్లను కార్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కొన్నిరోజులుగా టాస్క్‌ఫోర్స్ విభాగంపై పలు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఎక్కెడక్కడ ఎవరిపై ఎక్కువగా ఆరోపణలు ఉన్నాయో వారి వివరాలు మొదట సేకరించి వారిలో కొందరిని ట్రాన్స్ఫర్ చేయగా, మరికొందరిపై సాధారణంగానే ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులోనూ ఎక్కువగా ఉమ్మడి దక్షిణ మండలంపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న 22 మంది పోలీసు సిబ్బందిని టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేస్తూ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సౌత్ఈస్ట్జోన్కు ఒక ఎస్ఐతో సహా ఏడుగురిని, సౌత్ జోన్‌కు ఒక ఎస్ఐతో పాటు ముగ్గురిని,సౌత్ వెస్ట్‌జోన్‌కు ముగ్గురిని, నార్త్‌జోన్‌కు ఇద్దరు, సెంట్రల్‌జోన్ ముగ్గురు, వెస్ట్‌జోన్‌కు ఇద్దరు, ఈస్ట్‌జోన్‌కు ఒకరిని కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.