బేగంపేట్, ఫిబ్రవరి 3: బట్టల వ్యాపారంలో నష్టం రావడంతో భారీ దొంగతనానికి పాల్పడిన వివిధ రాష్ర్టాలకు చెం దిన ముగ్గురు నిందితులను సికింద్రాబాద్ మహంకాళి పోలీసు లు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.28.62వేల నగ దు రికవరీ చేశారు. సోమవారం మహంకాళి ఏసీపీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్స్పెక్టర్ పరశురాం లుతో కలిసి ఏసీపీ సర్ధార్‌సింగ్ వివరాలు వెల్లడించారు. సుచి త్ర ప్రాంతంలో నివాసముంటున్న జయేశ్ పటేల్ సికింద్రాబాద్ ఓల్డ్బోయిగూడ ప్రాంతంలో డీప్ ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. అయితే జయేశ్ పటేల్.. తన పిల్లల చదువు కోసం రూ.30 లక్షల నగదును షాపులో పెట్టాడు. ఈ నెల1న గుర్తు తెలియని దుండగులు దుకాణం షట్టర్ పగులగొట్టి లాకర్లో ఉన్న నగదును దొంగిలించారు. మరుసటి రోజు గమనించిన జయేశ్పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్ప డి.. సీసీ ఫుటేజీలు, ఫోన్ ట్యాపింగ్, ఇతర మాధ్యమాల ద్వారా నిందితులను 28 గంటల్లో పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మహంకాళి, మార్కెట్, రాంగోపాల్‌పేట్ పోలీసులు పాల్గొన్నారు.
వ్యాపారంలో నష్టంతోనే..
మహారాష్ట్ర భీమండికి చెందిన మురళీధర్మోహన్(39), ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్‌కు చెందిన చంద్రభన్ పటేల్(39), ఉదయ్‌రాజ్(48)లు సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో బట్ట లు వ్యాపారం చేశారు. అయితే వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో దొంగతనాన్ని ఎంచుకున్నారు. ఈక్రమంలో ఓల్డ్ బోయిగూడలో రెక్కీ నిర్వహించారు. మురళీధర్ మోహన్ డీప్ ఇంజినీరింగ్‌పై దృష్టి సారించి.. ఈ నెల 1న కంపెనీ షట్టర్ పగులగొట్టి లాకర్లో ఉన్న రూ.30.20 లక్షలను దొంగిలించారు. అనంత రం మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సితార లాడ్జిలో బస చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా సోమవారం సితార లాడ్జిలో ఉన్న ఈ ముగ్గురి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.28.62లక్షల నగదును రికవరీ చేశారు.