జవహర్‌నగర్, మే 3: మాజీ సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన సంక్షేమమే తెలంగాణకు మణిహారమైందని, ప్రజా పాలనను తిరస్కరిస్తూ బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజా సమస్యలపై కొట్లాడుదామని, కార్యకర్తలు అధైర్యపడొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. జవహర్‌నగర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీకి చెందిన 150 మంది కార్యకర్తలు జవహర్‌నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ప్రజలు ఏనాడూ అవస్థలు పడలేదన్నారు. కాళేశ్వరంతో కేసీఆర్ రైతుల కండ్లలో ఆనందం నింపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులు రోడ్డుపై నిలబడి తమ హక్కుల కోసం పారాడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జిట్టా శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ పల్లపు రవి తదితరులు పాల్గొన్నారు.