Fire Accident | సనత్‌నగర్‌లో అగ్నిప్రమాదం.. డ్యూరోడైన్ ఇండస్ట్రీస్‌లో చెలరేగిన మంటలు
సనత్‌నగర్‌లోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్ ఇండస్ట్రీస్‌లో (Durodine Industries) గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: సనత్‌నగర్‌లోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్ ఇండస్ట్రీస్‌లో (Durodine Industries) గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించడంలో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో నల్లని పొగ దట్టంగా అలముకున్నది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్ఇంజన్లు, రోబో సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

