బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో టీటీయూసీ నాయకులు దేవానంద్, పరమేశ్వర్, రామన్న, హరిబాబు, లక్ష్మణ్, ఎయిర్టెల్ రాజుతోపాటు పెద్ద సంఖ్యలో కార్మిక నాయకులు బీఆర్టీయూలో చేరారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మినిమం వేజ్ బోర్డ్ మాజీ చైర్మన్ నారాయణ, బీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు వేముల మారయ్య, లక్ష్మణ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. – చిక్కడపల్లి