బంజారాహిల్స్, జూలై 10 : మారుతీ సుజికీ సంస్థ రూపొందించిన లేటెస్ట్ డిజైన్ ‘ఇన్విక్టో’కారును హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని వరుణ్ నెక్సా షోరూమ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీనటుడు సూరంపూడి సుదర్శన్, మారుతీ సుజికీ నెక్సా రీజినల్ మేనేజర్ అమిత్‌కుమార్ సింగ్ చేతులమీదుగా ఇన్విక్టో కారు మోడల్‌ను ఆవిష్కరించారు. ఆకట్టుకునే డిజైన్‌తో నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఇన్వెక్టా సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టినట్లు అమిత్‌కుమార్ సింగ్ తెలిపారు. రూ.24.79 లక్షల నుంచి రూ.28.42లక్షలకు లభించే 7సీటర్ ఎస్యూవీ నగరవాసుల అవసరాలను అనుగుణంగా తీర్చిదిద్దబడిందని పేర్కొన్నారు. బుకింగ్స్ ప్రారంభమయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఆర్టీవో రాంచందర్, హెచ్డీఎఫ్సీ రీజినల్ సేల్స్‌మెన్ వరదరాజు తదితరులు పాల్గొన్నారు.