బంజారాహిల్స్, ఏప్రిల్ 26: ‘ఉద్యోగం విషయంలో అబద్దం చెప్పి భారీగా కట్నకానుకలు తీసుకొని,. ఎంగేజ్మెంట్ కోసం భారీగా ఖర్చుపెట్టిన తర్వాత పెళ్లి రద్దు చేసుకున్నారు..’ అంటూ పెళ్లి కుమార్తె తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పెళ్లికొడుకుతో పాటు కుటుంబసభ్యులపై కేసు నమోదైంది. మరోవైపు తమ ఇంటిమీదకు వచ్చి దాడికి పాల్పడ్డారంటూ పెళ్లికొడుకు తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పెళ్లి కుమార్తె తల్లితోపాటు మరికొంతమందిపై మరో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్‌లోని గ్రీన్ వాక్‌వేస్ విల్లాస్‌లో నివాసం ఉంటు న్న టీడీపీ నేత, నోవా మెడికల్ కళాశాలల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు, డా.విజయనిర్మల కుమార్తెతో జూబ్లీహి ల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో ని వాసం ఉంటున్న దివీస్ ఫార్మా కంపెనీ ఉద్యోగి పెండ్యా ల సాయి అక్షయ్‌కుమార్‌కు పెండ్లి సంబంధం కుదిరింది.
తమ కుమారుడు దివీస్ ఫార్మా సంస్థలో ఉన్నత స్థా యిలో ఉద్యోగం చేస్తున్నాడని, త్వరలో మరింత పెద్దస్థాయిలోకి వెళ్లనున్నాడని పెండ్యాల సుధాకర్, అతడి భా ర్య ఉషా పెండ్యాల తదితరులు నమ్మబలకడంతో రూ. 1కోటి వరకట్నంతోపాటు ఖరీదైన బహుమతులు, బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన వాచీ ఇచ్చారు. కాగా ఎంగేజ్మెం ట్ అయిన కొన్ని రోజులకే రెండు కుటుంబాల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. పెళ్లికొడుకు ఉద్యోగం విషయంలో అబద్దాలు చెప్పారని, వరకట్నం అవసరం లేదని ముందు చెప్పి భారీగా కట్నకానుకలు డిమాండ్ చేస్తున్నారని పెళ్లికుమార్తె కుటుంబసభ్యులు ఆరోపించా రు. దీంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నామని పెండ్యాల సుధాకర్ తెలిపారు. తాము ఇచ్చిన కట్న కానుకలు, ఎం గేజ్మెంట్ కోసం పెట్టిన ఖర్చును వెనక్కి ఇవ్వాలని కోర గా డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో పాటు తమ కుటు ంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రెండ్రోజుల క్రితం నోవా మెడికల్ కాలేజ్ చైర్ పర్సన్ డా.విజయనిర్మలతో పాటు సుమారు 70మంది వ్యక్తులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని పెండ్యా ల సుధాకర్ ఇంటివద్దకు వచ్చారు.
వాచ్‌మెన్‌ను తోసేయడంతో పాటు గేట్లు విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు. ఫర్నిచర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పెండ్యాల సుధాకర్ కుటుంబసభ్యులను చంపేస్తామంటూ వార్నిం గ్ ఇచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మేరకు సుధాకర్ డయల్ 100కు ఫోన్ చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాం తింపజేశారు. తమ ఇంటిమీదకు వచ్చి దాడికి పాల్పడ్డ డా.విజయనిర్మలతో పాటు ఆమె అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ పెండ్యాల సుధాకర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కాగా తప్పుడు సమాచారంతో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడమే కాకుండా భారీగా వరకట్నం డిమాండ్ చేసి, ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత పెళ్లి రద్దు చేసుకోవడంతో తమ కుమార్తె తీవ్ర డిఫ్రెషన్‌కు గురైందని, దీనికి బాధ్యులైన పెండ్యాల సాయి అక్షయ్, అతడి తండ్రి పెండ్యాల సుధాకర్, తల్లి పెండ్యాల ఉష, సోదరి క్రితి పెండ్యాలపై చర్యలు తీసుకోవాలని పెళ్లి కుమార్తె తల్లి డా.విజయనిర్మల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.