హైకోర్టు తీర్పు హర్షణీయం
పేదల బస్తీలపైకి బుల్డోజర్లు నడిపిస్తూ వేలాది కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన హైడ్రా కమిషనర్‌ను వెంటనే పదవిలో నుంచి తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
- ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి
బంజారాహిల్స్, జూలై 27: పేదల బస్తీలపైకి బుల్డోజర్లు నడిపిస్తూ వేలాది కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన హైడ్రా కమిషనర్‌ను వెంటనే పదవిలో నుంచి తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
సోమవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా బడాబాబులను కాపాడుతూ పేదలపైకి బుల్డోజర్లు నడిపించిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్ బస్తీలో పేదల గుడిసెలను తొలగించి బడాబాబులకు మద్దతు పలికారని, సోమాజిగూడ డివిజన్లోని అనేక బస్తీల్లో పేదల ఇండ్లు తొలగించేలా బెదిరింపులకు దిగారన్నారు. ఇప్పటికైనా హైడ్రా పేరుతో సాగుతున్న అరాచకాన్ని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

