కంటోన్మెంట్, అక్టోబర్8:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై జరిగిన దాడి దేశంలో ఉండే దళితులందరిపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం డైమాండ్పాయింట్ గాయత్రిగార్డెన్లో మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని సీరియస్‌గా తీసుకోవాలని, పోలీసు శాఖ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా దాడి జరిగిందని న్యాయవ్యవస్థపై దాడి జరిగినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులు ఏకతాటిపై నిలబడి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక అందించాలని కోరారు. ప్రధాని మోదీ దాడి ఘటనపై సీజేతో మాట్లాడారన్నారు. గవాయ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ పది రోజుల పాటు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా, మండల కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులను సూచించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కంటోన్మెంట్ ఇన్చార్జి శ్రీకిషన్ మాదిగ, రాష్ట్ర నాయకులు అజిత్ కల్యాణ్, బాబేందర్, జిల్లా అధ్యక్షులు టివి.నరసింహ, గోవింద్ నరేశ్, డప్పు మల్లిఖార్జున్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.