రవీంద్రభారతి, జనవరి 27: సుప్రీం కోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా రా ష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని, అమలు చేసేందుకు ప్ర త్యేక అర్డినెన్స్ తీసుకువచ్చి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొట్ట మొదటిగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మంద కృష్ణ మాదిగ గుర్తు చేశారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ‘లక్ష డప్పులు-వేల గొంతుకలు’ కార్యక్రమం పై సోమవారం మీట్ ద ప్రెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే అధ్యక్షు డు కె.వీరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.నా రాయణ హాజరయ్యారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మంద కృష్ణ మాదిగ సమాధానం ఇ చ్చారు. ఆయన మాట్లాడుతూ, వర్గీకరణ అ మలు కాకుండా మాల సామాజిక వర్గం ఒత్తిళ్లకు తలొగ్గిన సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణను అమలు చేయడం లేదన్నారు. అందుకే ఫిబ్రవరి 7వ తేదీన లక్ష డప్పులు, వేల గొంతుకలు కార్యక్రమాన్ని ట్యాంక్ బండ్‌పై నిర్వహిస్తామన్నారు.
ఆర్డినెన్స్ తీసుకువచ్చి అమలు చేస్తాన ని, ఇప్పుడు వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 1వ తేదీన సుప్రీం కోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, నాలుగు నె లల 26 రోజులు గడుస్తున్నా ఎందుకు వర్గీకరణను అమలు చేయడం లేదని విమర్శించా రు. వర్గీకరణ చేయకుండానే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని, గ్రూప్-1,2,3 అమ లు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. వర్గీకరణ చేయకుండానే టీచర్ పోస్టులను భర్తీ చేశారని చెప్పారు. ఈ మూడు మా టలకు కట్టుబడి ఉంటే తాము రోడ్డు ఎక్కాల్సి న అవసరం ఉండేది కాదన్నారు.
అందుకే తా ము సాంస్కృతిక, వాయిద్యా ఉద్యమాన్ని చేపడుతున్నామని వివరించారు. వర్గీకరణకు తె లంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇ చ్చారన్నారు. జాతీయ స్థాయిలో జేడీఎస్, ఆ ప్, శివసేన, ఆర్జేడీ పార్టీలు మద్దతు ఇచ్చాయ ని పేర్కొన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సు ప్రీం కోర్టు తీర్పు ఇస్తే గంటలోపునే వర్గీకరణ రద్దు చేయించారని గుర్తు చేశారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి సాంస్కృతిక వాయిద్య ఉద్యమానికి హైదరాబాద్ వేదిక కాబోతుందన్నారు. వర్గీకరణకు చేయవద్దని భట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి, మల్లు రవిలు అడ్డుపడుతున్నారని, తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు లగడపాటి రాజ్ గోపాల్ అడ్డుపడ్డారని, ఇప్పుడు వర్గీకరణకు భట్టి విక్రమార్క, మల్లు రవి, వివేక్ వెంకటస్వామిలు అడ్డుపడుతూ మాదిగల పొట్ట కొడుతున్నారన్నారు. పద్మశ్రీ అవార్డు తనకు ప్రకటించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి అభినందన లు తెలిపారన్నారు.
కానీ, తాము పంపించిన జాబితాలో ఎవ్వరికి రాలేదన్నారని మంద కృ ష్ణ మాదిగ అన్నారు. మాల సామాజిక వర్గం గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ లాంటి పేర్లు పంపించారని, కేవలం లేఖ రాసి ఊరుకున్నారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డులు ఇవ్వాల్సిన వ్యక్తుల ప్రతిభ గురించి కేంద్రానికి చెప్పి ఇప్పించాల్సిందని చెప్పారు. మాదిగ రిజర్వేషన్‌తో పాటు సామాజిక ఉద్యమాలు నడిపిన నేపథ్యం తమకు ఉం దన్నారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పెన్షన్ లాం టి సామాజిక మార్పులు తీసుకొచ్చిన చరిత్ర తనదని మంద కృష్ణ మాదిగ అన్నారు.