ఖైరతాబాద్, డిసెంబర్ 26 : నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ దవాఖానలో చేర్పించారు. జగన్నాధం మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. నిమ్స్ ఆర్ఐసీయూలో ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అస్వస్థత విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్యేలు లక్ష్మీరెడ్డి, వివేకానంద, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు నిమ్స్‌కు చేరుకొని ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.