గాంధీ ఆస్పత్రిలో అంబులెన్స్ చోరీ.. నిందితుడు అరెస్ట్
Gandhi Hospital | హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అంబులెన్స్ చోరీకి గురైంది. అంబులెన్స్‌ను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కరీంనగర్ నుంచి ఓ రోగిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అంబులెన్స్ చోరీకి గురైంది. అంబులెన్స్‌ను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కరీంనగర్ నుంచి ఓ రోగిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అయితే అంబులెన్స్‌కే తాళాలను ఉంచి, డ్రైవర్ రోగిని తీసుకొని ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లాడు. ఇక అంబులెన్స్‌కు తాళాలు ఉన్న విషయాన్ని ఓ వ్యక్తి గమనించాడు. క్షణాల్లోనే అంబులెన్స్‌ను తీసుకొని పారిపోయాడు.
అంబులెన్స్ డ్రైవర్ ఎల్ శ్రీనివాస్ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంబులెన్స్ ఆచూకీ కోసం గాలించారు. అంబులెన్స్‌ను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని సికింద్రాబాద్ న్యూబోయిగూడకు చెందిన కే యాదగిరి(33)గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే మూడు దొంగతనం కేసులు గాంధీనగర్ పీఎస్‌లో నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి నుంచి అంబులెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

