ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
మురసు తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ములకలపల్లి, నమస్తే తెలంగాణ, నవంబర్ 4: మురసు తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమవ్వగా.. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి.
పాల్వంచ నుంచి మాదారం మీదుగా అన్నపురెడ్డిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై సత్యంపేట గ్రామం వద్ద పాములేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతుండటంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పాల్వంచ నుంచి దమ్మపేట వెళ్లే ప్రధాన రహదారిపై రాజుపేట శివారులో పాములేరు వాగుపై ఇటీవల కూలిన వంతెన పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక అప్రోచ్ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు భారీ వర్షాలతో మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో సాగు చేస్తున్న వరి, మిర్చి, పుచ్చ, శనగ తదితర పంటలు నీట మునుగుతున్నాయి. ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తాజా వర్షాలు మరింత నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే పంటలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

