మహిళలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
మ్యాట్రీమోని వెబ్సైట్ పేరుతో మహిళలను మోసం చేయడమే గాకుండా.. నగలను కాజేస్తున్న నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
- వివరాలను వెల్లడించిన ఏసీపీ రవీందర్
సిటీబ్యూరో/కంటోన్మెంట్, నవంబర్ 16: మ్యాట్రీమోని వెబ్సైట్ పేరుతో మహిళలను మోసం చేయడమే గాకుండా.. నగలను కాజేస్తున్న నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి నగలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహంకాళి ఏసీపీ రవీందర్ వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా నేదునూర్ గ్రామానికి చెందిన తుమ్మ మోహన్ రెడ్డి అలియాస్ శ్రీనాథ్(38) ప్రైవేట్ ఉద్యోగి. సులువుగా డబ్బు సంపాదించేందుకు మ్యాట్రీమోని పేరుతో అమాయక మహిళలు, యువతులను మోసం చేస్తున్నాడు. నిందితుడు భరత్ మాట్రీమోని పేరుతో నకిలీ వెబ్ సైట్‌ను క్రియేట్ చేశాడు. ఈ మ్యాట్రీమోని వెబ్సైట్ ద్వారా ఓ యువతి పరిచయమయ్యింది. ఈనెల 8వ తేదీన ఆ యువతిని సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జికి రావాలని సూచించాడు. అతడు చెప్పిన ప్రకారం ఆమె (బాధితురాలు) లాడ్జికి వెళ్లి శ్రీనాథన్ను కలిసింది. ఆమె బ్యాగు పక్కన బెట్టి.. బాత్రూంకు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత ఆమె వచ్చి చూడగా.. అక్కడ బ్యాగు కనిపించలేదు.. అతడు కూడా అదృశ్యమయ్యాడు. ఆ బ్యాగులో 27 తులాల బంగారు నగలున్నాయి. దీంతో బాధితురాలు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.
నిందితుడి నేర చరిత్ర..
నిందితుడిని విచారించగా పలు ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా నిందితుడు చాలా మంది యువతులను మోసం చేసినట్టు విచారణలో వెల్లడైంది. రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నిందితుడు టీచర్‌గా పని చేసినట్టు పోలీసులు గుర్తించారు. 2011లో బాలికను వేధించిన కేసులో అరెస్టయిన నిందితుడు.. మూడు నెలల పాటు జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన అతడు తిరిగి నేరాలు చేయడం మొదలు పెట్టాడు. నిందితుడిపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలా కాలంగా నేరాలు చేస్తున్న నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్, 27 తులాల బంగారు నగలు, కోటక్ మహేంద్రా చెక్ బుక్, హెచ్డీఎప్సీ క్రెడిట్ కార్డు, జోయాలుక్కాస్, లలితా జ్యూవెల్లరీ ఇన్వాయిస్ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

