గోల్నాక, సెప్టెంబర్ 12 : ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మమ్మ మెడలోంచి బలవంతంగా బంగారు గొలుసు దొంగిలించిన మనవడితోపాటు అతనికి సహకరించిన మరో యువకుడిని అంబర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోడబండలో నివాసముండే బ్రిజష్ పాల్ ఈ నెల 7వ తేదీన అంబర్‌పేట శంకర్‌నగర్‌లో ఉండే తన సవతి తల్లి వద్దకు ఆధార్ కార్డు కోసం వచ్చాడు.
ఆ సమయంలో అతని అమ్మమ్మ రాజకుమారి ఇంట్లో ఒంటరిగా ఉండగా, అదే అదునుగా భావించిన బ్రిజష్ పాల్ ఆమె మెడపై విజిటేబుల్ పిల్లర్‌తో స్వల్పంగా గాయపరిచి 28గ్రాముల బరువుగల బంగారు గొలుసును బలవంతంగా తెంపుకొని అకక్కడి నుంచి పారిపోయాడు. దొంగిలించిన గొలుసును అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు పర్వేజ్ వద్ద ఉంచాడు.
శుక్రవారం ఉదయం ఇద్దరు కలిసి బోడబండ నుంచి కారులో అంబర్ పేటకు వచ్చి తిలక్‌నగర్‌లోని ఓ బంగారు షాపులో బంగారు గొలుసు అమ్మేందుకు ప్రయత్నిస్తండగా అక్కడే మాటు వేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమ్డాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 28గ్రాముల బంగారు గొలుసు, సెల్ ఫోన్‌తోపాటు వారు వాడిన షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు.