పహాడీషరీఫ్: మిత్రునితో ఉన్న పాత కక్షలను మనసులో పెట్టుకున్న అతన్ని హత్యచేయాలని కత్తితో దాడి చేసిన ఘటన బాలాపూర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లింగస్వామి వివరాల ప్రకారం బాలాపూర్ పోలీస్టేషన్ పరిధిలోని తయ్యబకాలనీలో నివాసముంటున్నఆటో డ్రైవర్ మహ్మద్ జబ్బార్ (21), చంద్రాయణగుట్ట పోలీస్టేషన్ పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ మూసా ఇద్దరు స్నేహితులు.
గతంలో ఉన్న పాతకక్షల కారణంగా మహ్మద్ జబ్బార్ తన స్నేహితుడైన మహ్మద్ మూసాను హత్య చేయడానికి పథకం పన్ని సోమవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి పిలిపించుకున్నాడు, మద్యం సేవించిన అనంతరం కత్తితో మహ్మద్ మూసాను తలపై, చేతులపై పొడిచాడు. మూసా అతని నుంచి తప్పించుకుని పారిపోయాడు. ప్రస్తుతం ఉస్మానియా దవాఖానలో చికిత్స తీసుకుంటున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం జబ్బార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని నుంచి చిన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు.