Hyderabad | హైదరాబాద్ బోరబండలో యువతి దారుణ హత్యకు గురైంది. పబ్‌లో పరిచయమైన అమ్మాయి తనతో మాట్లాడటం మానేసిందనే కోపంతో హత్య చేసి గోడ పక్కనే పడేశాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. జహీర్ జ్యూస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. పబ్‌లో పనిచేసే సమయంలో అతనికి ఖనీజ్ ఫాతిమా పరిచయం అయ్యింది. ఇద్దరూ కొంతకాలం స్నేహంగానే ఉన్నారు. అయితే ఇటీవల ఫాతిమా వేరే పబ్‌లో ఉద్యోగంలో చేరింది. అప్పటి నుంచి జహీర్‌తో మాట్లాడటం తగ్గించింది. దీంతో ఫాతిమాపై అనుమానం పెంచుకున్న అతను.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మాట్లాడుకుందామని చెప్పి ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను చంపేసి, పక్కనే ఉన్న బస్తీకి వెళ్లాడు. బస్తీవాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల అసలు కారణాలేంటి? నిజంగానే మాట్లాడటం లేదని హత్య చేశాడా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.