న్యూడ్ కాల్స్‌తో వేధిస్తున్న యువతిపై ఫిర్యాదు చేసిన యువకుడు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ)/ : న్యూడ్ కాల్స్‌తో వేధిస్తున్న యువతిపై ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే… గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న యువకుడి(26)కి నాలుగు రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో స్వీట్‌గర్ల్ 948 అనే ఐడీతో ఒక యువతి పరిచయమైంది. చాటింగ్, సంభాషణలతో ఒకరికొకరు స్నేహితులయ్యారు. ఫోన్‌నంబర్లు మార్చుకున్నారు. రెండు రోజులు గడిచిందో లేదా వాట్సాప్ వీడియోకాల్స్ చేసుకోవడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో సదరు యువతి వీడియో కాల్స్ ద్వారా నగ్నంగా తన అందచందాలను ఆరబోసింది. దీనికి మంత్రముగ్ధుడైన యువకుడు నేను సైతం అన్నాడు. సీన్ కట్ చేస్తే, మరుసటి రోజు నుంచి యువకుడికి అతడి నగ్న వీడియోలు, చిత్రాలను యువతి పంపించడం మొదలు పెట్టింది. అంతేకాదు.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్న వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్‌కు దిగింది. దీంతో కళ్లు తెరిచిన యువకుడు.. తాను మాయ లేడి వలలో పడి మోసపోయినట్లు గ్రహించి, గురువారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.