IND vs WI : వన్డే సిరీస్‌ను 2-1తో గెలుపొందిన భారత జట్టు.. టీ20 సవాల్‌కు సిద్ధమైంది. ఆసియా క్రీడల్లో వరసగా రెండో స్వర్ణం గెలుపొందిన టీమిండియా అదిరే బోణీతో సిరీస్ ఆరంభించాలనుకుంటోంది. లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. ఊహించినట్టే వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. హిట్టర్లతో నిండిన, ఐపీఎల్ అనుభవం కలిగిన ఆటగాళ్లు విండీస్ జట్టులో ఉన్నారు. దాంతో.. బోణీ ఎవరిది? అనేది ఆసక్తి రేపుతోంది.
ఆసియా క్రీడల్లో స్వర్ణంతో జోష్ మీదున్న శ్రేయాస్ అయ్యర్ సేన జింబాబ్వే, అఫ్గనిస్థాన్‌పై విజయాలను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. టాస్ గెలిచిన అయ్యర్ ఛేదనకు మొగ్గు చూపాడు. టాస్కు ముందు పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేతులు మీదుగా ఐపీఎల్ స్టార్ నమన్ ధిర్ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. తుది జట్టు విషయానికొస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌మీదే ఉండనున్నాడు. అతడితో పాటు రవి బిష్ణోయ్, నితీశ్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్‌లను పక్కన పెట్టేశామని అయ్యర్ తెలిపాడు.
🚨 Toss and Team News 🚨
#TeamIndia have won the toss and elected to bowl in the 1️⃣st #INDvWI T20I.
Here’s a look at the Playing XI 🙌
Updates ▶️ https://t.co/2czVyKWreK
@mflone_ https://t.co/mgtnslR6GZ
— BCCI (@BCCI) October 6, 2026
భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, నమన్ ధిర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్.
వెస్టిండీస్ తుది జట్టు: షాయ్ హోప్(కెప్టెన్), కమిల్ పూరన్, షిమ్రన్ హిట్మైర్, రొవ్మన్ పావెల్, రూథర్‌ఫొర్డ్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫొర్డే, రోస్టన్ ఛేజ్, అకీల్ హొసేన్, షమర్ స్ప్రింగర్, షమర్ జోసెఫ్.