Vaibhav Sooryavanshi : భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవ లేదు. ఐపీఎల్ పుణ్యమా అని ధనాధన్ ఆటతో టీ20 హీరోలుగా అవతరించిన కుర్రాళ్లు చాలామందే. వీరిలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) సమ్‌థింగ్ స్పెషల్. అవును.. విధ్వంసక ఆటతో మేటి బౌలర్లకు సైతం దడ పుట్టించే ఈ పదిహేనేళ్ల అబ్బాయి ఇప్పుడు సీనియర్లకు సవాల్ విసురుతున్నాడు. పొట్టి ఫార్మాట్లో అతడి కోసం వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్(Sanju Samson)ను సైతం పక్కనపెట్టేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో వైభవ్ నుంచి మళ్లీ సంజూకు పోటీ ఎదురవుతోంది.
పదిహేనేళ్ల కుర్రాడైన వైభవ్ సూర్యవంశీ ధనాధన్ క్రికెట్‌తో అలరిస్తుంటే స్టేడియాలకు పోటెత్తుతున్నారు అభిమానులు. అందుకే అతడిని ఆడించేందుకు భారత మేనేజ్మెంట్ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైన వైభవ్‌ను బెంచ్‌మీదే కూర్చోబెట్టినా.. ఇంగ్లండ్‌పై శాంసన్‌ను తొలగించి మనోడికి అవకాశమిచ్చారు. పెద్ద బౌండరీలున్న అక్కడ ఈ చిచ్చరపిడుగు భారీ స్కోర్లు చేయకున్నా తన మార్క్ దూకుడుతో ఆకట్టుకున్నాడు. ఆపై జింబాబ్వే పర్యటనలో రెండు అర్ధ శతకాలతో మెరిశాడు వైభవ్. అయితే.. అఫ్గనిస్థాన్‌పై మాత్రం అతడికి ఛాన్స్ రాలేదు.
🏮NO VAIBHAV SOORYAVANSHI – MAJOR HINT FROM MORNE MORKEL 🤯
Morne 🗣️: I think the more time Vaibhav spends in this environment with the quality players, the more time he trains at this standard.
– it means vaibhav will not get a chance in 1st T20I but he will get chance in this series
– Abhishek sharma & Sanju samson could be the opener
If Gautam Gambhir & shreyas iyer is thinking about vaibhav sooryavanshi then they should give him a chance in place of Abhishek against West Indies
— VK (@Aur_vicky) October 6, 2026
దాంతో, ప్రతిభావంతుడైన వైభవ్‌ను ఎందుకు ఆడిస్తలేరు? అని మాజీలు కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో.. మంగళవారం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు.. వైభవ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.
పొట్టి క్రికెట్లో ఇప్పటికే నిరూపించుకున్న అభిషేక్ శర్మకు ఓపెనర్‌గా చోటు ఖాయమవ్వగా.. ఎటొచ్చి సంజూనే బలి అవుతున్నాడు. చిన్న వయస్కుడైన వైభవ్‌కు ఇంకా సమయం ఉందని, అతడు చూసి, గమనించి, నిరీక్షించి ఆటను మరింతగా చదవాలని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సూచించాడు.
కోచ్ గంభీర్ సైతం.. టాలెంట్ ఉన్నాసరే కొన్నిసార్లు అవకాశం కోసం ఎదురుచూడక తప్పదు అని వైభవ్‌ను ఉద్దేశించి అన్నాడు. దాంతో.. విండీస్‌పై ఈ టీనేజ్ సంచలనం బరిలోకి దిగుతాడా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటివరకూ ఎనిమిది టీ20ల్లో రెండు అర్ధ శతకాలతో వైభవ్ 246 పరుగులు సాధించాడు. 186.36 స్ట్రయిక్ రేటు నమోదు చేసిన అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్.. 81.