మేడ్చల్, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ): ఎందరో మహానుభావుల త్యాగఫలితంతోనే స్వాతంత్య్రం సిద్ధించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేశవరావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కలెక్టర్ మను చౌదరి, డీసీపీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, రాధికా గుప్తాలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు కలెక్టర్ మను చౌదరి ప్రశంసాపత్రాలు అందజేశారు.