అబిడ్స్/ సుల్తాన్‌బజార్/ మెహిదీపట్నం / కార్వాన్/చార్మినార్, జనవరి 19 : గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ నియోజకవర్గం పరిధిలోని ఆరు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నందకిశోర్ వ్యాస్, గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి ప్రేమ్‌సింగ్ రాథోడ్, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్‌యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు ఆర్వీ మహేందర్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు ఎం. ఆనంద్‌కుమార్‌గౌడ్, జాంబాగ్ కార్పొరేటర్ రాకేశ్జైస్వాల్, గోషామహల్ కార్పొరేటర్ లాల్‌సింగ్, మాజీ కార్పొరేటర్ ముఖేశ్‌సింగ్, పరమేశ్వరిసింగ్ వివిధ ప్రాంతాల్లోని కంటి వెలుగు కేంద్రాలను ప్రారంభించారు.
పారదోలేందుకు ఉచిత కంటి వెలుగు కేంద్రాలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చా యి. ఈ మేరకు కింగ్‌కోఠి క్లస్టర్ పరిధిలోని ఆరు యూపీహెచ్సీల పరిధిలో కంటి వైద్య కేంద్రాలలో ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో నిర్వహించిన కంటి వెలుగు కేంద్రాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సురేఖా ఓంప్రకాశ్, మెడికల్ ఆఫీసర్ స్నేహికలతో కలిసి ప్రారంభించారు.
పన్నీపురా కమ్యూనిటీ హాల్లో, ఆర్య సమాజ్ బస్తీ, టెలికాం కాలనీలలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, కార్పొరేటర్ ఎం. స్వామి యాదవ్, వైద్యాధికారులతో కలిసి కంటి వెలుగు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ అనూరాధ, వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
సర్కిల్ పరిధిలోని ఒవైసీ స్పోర్ట్ కాంపెక్స్‌లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యకరమాన్ని బహదూర్‌పుర ఎమ్మెల్యే మౌజంఖాన్ గురువారం జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రాజేంధర్రెడ్డితో కలిసి ప్రారంభించారు.