తెలుగు యూనివర్సిటీ, మే 15 : నాంపల్లి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. జైపూర్ వెళ్లాల్సిన రైలు ఏసీ బోగీలో మంటలు వచ్చాయి. నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకొని బీ1 బోగీలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.